సౌత్ హీరోయిన్లకు నో ఛాన్స్..

bolly-wood-14-.jpg

ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తే అంత పెద్ద హీరో అన్నట్టు ట్రెండ్ మారింది. స్టార్ హీరోల దగ్గరి నుంచి యావరేజ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. పాన్ ఇండియా సినిమాలు అంటే కేవలం బాలీవుడ్ హీరోయిన్లను మాత్రమే తీసుకోవాలి అన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు. స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు అంటే చాలు బాలీవుడ్ హీరోయిన్లే ఏరికోరి మరీ పెట్టుకుంటున్నారు. మన సౌత్ లో హీరోయిన్లే లేనట్టు. తెలుగు అసలే లేనట్టు బాలీవుడ్ ను మాత్రమే చూస్తున్నారు. బాహుబలి తప్ప ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో అందరూ బాలీవుడ్ భామలే.

ప్రభాస్ సినిమాలు చూస్తే సాహో, కల్కి, ఫౌజీ ఇప్పుడు స్పిరిట్ లో కూడా బాలీవుడ్ హీరోయిన్లే నటిస్తున్నారు. రామ్ చరణ్‌ నటించిన త్రిబుల్ ఆర్, గేమ్ ఛేంజర్ ఇప్పుడు పెద్ది సినిమాలో బాలీవుడ్ భామలనే తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ నటించిన దేవరతో పాటు ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీలో, దేవర-2 సినిమాలో బాలీవుడ్ హీరోయిన్లనే ఎంచుకుంటున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో తీస్తున్న సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కే ఓటు వేస్తున్నాడు. మహేశ్-రాజమౌళి మూవీలో ప్రియాంక చొప్రా నటిస్తోంది.

ఇలా అందరూ బాలీవుడ్ భామలకే జై కొడుతున్నారు. దీనికి ఓ కారణం కూడా ఉంది. బాలీవుడ్ హీరోయిన్లకు అతిపెద్ద హిందీ మార్కెట్ లో క్రేజ్ ఉంటుంది. కాబట్టి వాళ్లను తీసుకుంటే హిందీ బెల్ట్ లో మూవీకి క్రేజ్ ఉంటుందనేది వాళ్ల ఆలోచన కావచ్చు. కానీ ఆల్రెడీ హిందీ బెల్ట్ లో తెలుగు స్టార్లకు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అక్కడ హిట్లు కూడా కొట్టారు. అయినా సరే బాలీవుడ్ భామలు ఉండాల్సిందే అన్నట్టు వారినే తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో సరిగ్గా ఛాన్సులు రాని హీరోయిన్లకు ఇక్కడ పాన్ ఇండియా మూవీల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇదే వారికి తంతే బూరెల బుట్టల్లో పడ్డట్టు అయిపోయింది. ఈ పోటీలో జాన్వీకపూర్, దీపికా పదుకొణె ముందు వరుసలో ఉన్నారు.

Share this post

scroll to top