విజయవాడ బీసెంట్ రోడ్డు లోని ఎల్ఐసీ భవనానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీసెంట్ రోడ్డులో షాపులన్నింటినీ క్లోజ్ చేయించి బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేయిస్తున్నారు. బాంబు పెట్టారన్న వార్తలు గుప్పుమనడంతో ఆ ప్రాంత వాసులంతా భయాందోళన చెందుతున్నారు. కాగా కాల్ చేసిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.
విజయవాడలో బాంబు కలకలం..
