బంగ్లాదేశ్ జరుగుతున్న పరిణామాలు ప్రధాని నరేంద్ర మోడీకి గుణపాఠం కావాలని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని కామెంట్ చేశారు. ముస్లిం మైనారిటీలు, వారికి సంబంధించిన హక్కులను కాలరాసేందుకు ఎన్డీఏ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బిల్లుపై తమకు కూడా అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది అప్పు మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేకంగా తామేదో రాష్ట్రానికి నిధులు వరద పారించనట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పచ్చి అబద్ధాల చెప్పారని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న బంగ్లాదేశ్‌కు పట్టిన గతిని చూసి ప్రధాని మోడీకి గుణపాఠం కావాలన్నారు.
బంగ్లాదేశ్ పరిణామాలు మోదీకి గుణపాఠం కావాలి..
