సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్‌కు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ అని తెలిపారు హరీశ్‌రావు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ నేతలు తామే కట్టినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోపే సీతారామ ప్రాజెక్ట్ కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేసిందా అంటూ సెటైర్లు వేశారు. హస్తం పార్టీ నేతలు పరాన్న జీవులుగా తయారయ్యారని, వారి ప్రవర్తన చూసి జనం కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఖమ్మం జిల్లాను కరువు కోరల్లోంచి బయటకు తీసుకొచ్చేందుకు సీతారామ ప్రాజెక్ట్ కట్టాలని కేసీఆర్ ఆనాడే సంకల్పించారని గుర్తు చేశారు. జిల్లాలో ఇవాళ అన్ని పనులు పూర్తయ్యాక మంత్రులు పోటీపడి మరీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఒక్కటి కాదు తాము పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకోవడ హాస్యాస్పదంగా ఉందన్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్ కు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్..
