కవితకు ఎలాంటి ప్రమాదం లేదు..

kavitha-23.jpg

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గత 5 నెలలుగా జైలులోనే ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 27కు వాయిదా వేసింది. అయితే బెయిల్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని జైలు అధికారులు తెలిపారు. కాగా, కవిత గత కొంతకాలంగా గైనిక్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జూలై 16న కూడా అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం కవిత తీవ్ర జ్వరం, నీరసంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. మళ్లీ అనారోగ్యం బారిన పడడంతో పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share this post

scroll to top