సొంత పార్టీ నేతలే యాదయ్యకు షాక్..

yadaya-28.jpg

చెవెళ్ల కాలె యాదయ్యకు వింత అనుభవం ఎదురైంది. ఏకంగా సొంత పార్టీ నేతలే ఆయనకు షాకిచ్చారు. బుధవారం ఆయన కల్యాణ‌లక్ష్మి చెక్కుల పంపిణీ కోసం షాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఆయనపై ఒక్కసారిగి తిరగబడ్డారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు. చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఉన్న భీమ్ భరత్‌ వర్గాన్ని తన వెంట కలుపుకుని పోవట్లేదంటూ ఫైర్ అయ్యారు. మొదటి నుంచి పార్టీలో ఉండి కష్టపడ్డామని నేడు ఎమ్మెల్యే అవ్వగానే పాత నాయకులను ఎలా మర్చిపోతారంటూ ఆయనను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు బాహాబాహీకి దిగేందుకు ప్రయత్నించగా సమయానికి అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఓ దశలో భరత్ వర్గీయులు ఎమ్మెల్యే కాలె యాదయ్య వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు. అనంతరం రెండు వర్గాల పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది.

Share this post