జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తివేయండి..

spekar-15.jpg

సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్‌ను కోరింది. స్పీకర్ పట్ల సీనియర్ శాసన సభ్యుడైన జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సస్పెన్షన్ పై  ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, సస్పెన్షన్‌కు గురైన జగదీశ్ రెడ్డి వివరణ తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వారు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడారు. 

సభ మన అందరిది, సభ మీ ఒక్కరిది కాదంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి కామెంట్స్‌పై స్పీకర్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌తో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.

Share this post

scroll to top