వరంగల్ జిల్లా చేరుకున్న మాజీమంత్రి హరీష్ రావు కి బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభా ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు. సభకు వచ్చే కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఇక, హరీష్ రావు మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో అతి పెద్ద సభకు వేదిక నిలిచింది. ఇప్పటికి సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే జనం సభకి తరలి వస్తున్నారు. బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదు తెలంగాణ లేకపోతే ఇంత అభివృద్ధి ఉండేది కాదు తెలంగాణ ప్రజల పక్షంలోనే బీఆర్ఎస్ ఉంటుంది అని హరీష్ రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ సభపై ఇంట్రెస్ట్ పెరిగింది..
