తన్నుకోవడం, గుద్దుకోవడం పెద్ద ఇష్యూ కాదు నీవు మొగోడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. తన నివాసంలో పాడి కౌశిక్ రెడ్డి గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు. పూటకో పార్టీ మారే బ్రోకర్ గాంధీ. పోలీసు కంచెలు వేసి మీరు నన్ను ఆపారు పర్వాలేదు. గాంధీ వాడే భాషను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డను. ఎక్కడ్నుంచో వచ్చి మా గడ్డ కూర్చొని సవాల్ విసిరితే ఇక్కడ ఎవరూ భయపడరు.
కేటీఆర్, హరీశ్‌రావుతో మాట్లాడి అనుమతి తీసుకున్నా శుక్రవారం ఉదయం 11 గంటలకు మేడ్చల్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు అక్కడ్నుంచి శంభీపూర్ రాజు నాయకత్వంలో వేలాది మంది కార్యకర్తలతో గాంధీ ఇంటికి వెళ్తాం. అక్కడే బ్రేక్ ఫాస్ట్, లంచ్ చేద్దాం. గాంధీ బీఆర్ఎస్ కండువా కప్పుకున్న తర్వాత తెలంగాణ భవన్‌కు చేరుకుని ప్రెస్‌మీట్ పెడుదాం. అక్కడ్నుంచి గాంధీని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఘనస్వాగతం పలుకుదాం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త తరలిరావాలని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.