ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ రేపు తదుపరి విచారణ చేపట్టనున్నారు. కాగా, తన పిటిషన్లలో కవిత బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను ఆమె సవాల్ చేశారు.
కవిత తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది విక్రమ్ చౌదరి ఆమె అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐలు కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేశాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తదుపరి విచారణ జరగనుంది.