ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో ఫుడ్ పాయిజ‌న్..

kavitha-30.jpg

తెలంగాణ ప్ర‌భుత్వ స్కూల్స్, హాస్ట‌ళ్ల‌లో వ‌రుస‌గా చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌ల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. ఒకే ఒక్క రోజులో మూడు జిల్లాల్లో 50 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డం బాధాక‌ర‌మైన విష‌య‌మ‌న్నారు. ఇంకెంత మంది విద్యార్థులు ఫుడ్ పాయిజ‌న్‌తో బాధ‌ప‌డాల‌ని ఆమె బాధ్యతారాహిత్యంగా ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా పొలిటిక‌ల్ డ్రామాలో మునిగి తేలుతున్నార‌ని, తెలంగాణ భ‌విష్య‌త్ అయిన‌టువంటి మ‌న పిల్ల‌ల ప‌ట్ల పూర్తిగా నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన, పోషకమైన ఆహారం పొందే హక్కు ఉంది. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Share this post

scroll to top