ఇవాళ ఢిల్లీ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత..

kavitha-11.jpg

ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ చార్జ్‌ షీట్‌పై ఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు హాజరు కానున్నారు. ట్రయల్ కోర్ట్ విచారణకు వర్చువల్ గా ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు హాజరు కానున్నట్లు సమాచారం. కాగా ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీం కోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 

Share this post

scroll to top