తల్లికి బువ్వ లేదు చిన్నమ్మకు బంగారు గాజులా..

ktr-21.jpg

తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట! అని సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేశారు. మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత అని వచ్చిన వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్ మహిళలను కోటీశ్వరులను చేస్తాడట అని ఎద్దేవా చేశారు. అలాగే రోజుకో గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని, ఎన్నడూ లేనిది గురుకుల పాఠశాలలలో ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు మరణించారని వ్యాఖ్యానించారు. అంతేగాక పిల్లలు పిట్టల్లా రాలుతుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా వేదికల మీదికెక్కి పిట్టలదొర మాటలు చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Share this post

scroll to top