బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చెప్పిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందింది అనడానికి ఇంతకన్న సాక్ష్యం ఏం కావాలని అడిగారు. కేవలం తొమ్మిదిన్నరేండ్లలో జాతీయ సగటు కంటే 94 శాతం అధిక తలసరి ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలపారు అనడానికి ఇది నిరూపిస్తుందన్నారు. అంకెలు ఎప్పుడూ అబద్దాలు చెప్పవు. కేసీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చెరిపేయలేరు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. ఈ లెక్కలు తానేదో చెప్పడం లేదని కేంద్ర ప్రభుత్వమే స్వయానా వెల్లడించిందని కేటీఆర్ పేర్కొన్నారు.
అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు..
