సుంకిశాల ఘ‌ట‌న‌పై విజిలెన్స్ నివేదిక‌ను తొక్కిపెట్ట‌డం దారుణం..

ktr-11.jpg

సుంకిశాల ఘటనపై నివేదికను దాస్తోన్న రేవంత్ అంటూ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణం అని ఫైర్ అయ్యారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధించిన సమాచారహక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరం అన్నారు. మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలనే కమిటీ రిపోర్ట్‌ ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సిఎం రేవంత్ మేఘా కృష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే అని ఆరోపణలు చేసారు. సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్‌ కూలి రూ. 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లింది. హైదరాబాద్ లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడింది.

Share this post

scroll to top