శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మ‌హా నాయ‌కుడు కేసీఆర్..

ktr-20.jpg

రేవంత్ రెడ్డి జాక్‌పాట్‌ లో రాష్ట్రానికి సీఎం అయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సూర్యాపేట లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల ఏర్పాట్లపై పార్టీ నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తెలుగు వాళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అస్తిత్వం ఉందని చాటి చెప్పింది కేసీఆర్ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ధైర్యంగా పార్టీ పెట్టిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.

శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన ఘనుడు ఆయనొక్కడేనని అన్నారు. కేసీఆరే లేకపోతే ప్రత్యేక రాష్ట్రమే లేదని కామెంట్ చేశారు. చావు అంచుల దాకా వెళ్లి తెలంగాణను సాధించి, దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా నిలిపారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, ప్రతిపక్ష పాత్ర కొత్తేమి కాదనే విషయాన్ని అధికార పార్టీ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని తెలిపారు. ఓటమి తరువాత మళ్లీ ఫీనిక్స్ పక్షి లా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ బలపడిందని తెలిపారు. నిన్న, మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి ఓ జాక్‌పాట్ సీఎం అని ఢిల్లీ కి మూటలు పంపి పదవి కాపాడుకోవడమే ఆయన పనిగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

Share this post

scroll to top