రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఉభయ సభల సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఒంటిగంటకు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచనలు చేయనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సమావేశాలు ప్రారంభమవుతాయి.
రేపు బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం..
