బుచ్చిబాబు రూటే సపరేటు..

rama-charan-03.jpg

గేమ్ ఛేంజర్‌కు ఫలితంతో పని లేకుండా నటుడిగా మరో మెట్టు ఎక్కారు రామ్ చరణ్. ముఖ్యంగా అప్పన్న పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చరణ్ ఫోకస్ అంతా బుచ్చిబాబు సినిమాపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ నాన్‌స్టాప్‌గా నడుస్తుంది. దీనికోసం కొత్తగా పాతకాలం టెక్నాలజీని వాడుకోబోతున్నారు బుచ్చిబాబు. ఇదే ట్రెండింగ్ న్యూస్ ఇప్పుడు.ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగమే అన్నింటికీ హార్డ్ డిస్కులే. కానీ ఒకప్పుడలా కాదు ఫిలిం మేకింగ్ కోసం రీల్ వాడేవాళ్లు. కానీ అది ఖర్చుతో పని ఏ చిన్న తప్పు చేసినా రీల్ పోయినట్లే. రీల్‎తో షూట్ చేస్తే బిగ్ స్క్రీన్ మీద ఒరిజినాలిటీ కనిపిస్తుంది. తెలుస్తుంది.

అందుకే చెర్రీ హీరోగా నటిస్తున్న RC16 కోసం సినిమాటోగ్రఫర్ రత్నవేలు సినిమాలో కొంత భాగానికి నెగటివ్ రీల్ వాడనున్నట్లు RC16 పీరియడ్ సినిమా కాబట్టి.. రీల్‌తో షూట్ చేస్తే బాగుంటుందనేది రత్నవేలు ఆలోచన. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలెన్ ఓపెన్ హైమర్ సినిమాను ఇలాగే షూట్ చేసి రీల్స్ భద్రపరిచారు. హై బడ్జెట్ క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాలేదు. తాజాగా RC16లో కొంత భాగానికే ఇదే చేయాలని చూస్తున్నారు. ఇది వర్కవుట్ అయితే టాలీవుడ్‌లో మళ్లీ నెగిటివ్ రీల్ మేకింగ్‌కు ఊపొస్తుందేమో? మరి చూడలేక ఎం జరగనుందో అనే విషయం.

Share this post

scroll to top