మీరూ రాత్రిళ్లు మామిడి పండ్లు తింటున్నారా..

mango-26.jpg

పండ్లలో రారాజు మామిడి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పండ్ల మార్కెట్‌లో ఇవి అత్యధికంగా కనిపిస్తాయి. మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, సహజ చక్కెరలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి. కాబట్టి మామిడి పండ్లు తినడానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచివి. అయితే, మామిడి పండ్లు తినడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వీటిని పాటించకపోతే మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది. చాలా మంది ఉదయం లేదా మధ్యాహ్నం వీటిని తింటుంటారు. అయితే, చాలా మంది రాత్రి భోజనంతో పాటు మామిడిపండు తినే అలవాటు ఉంటుంది. చాలా మంది జ్యూస్‌గా కూడా తాగుతారు.

అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం ఉదయం లేదా మధ్యాహ్నం మామిడి పండ్లు తిన్నప్పటికీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మామిడి పండ్లు తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇది తీవ్రమైన శారీరక సమస్యలను కలిగిస్తుందట. రాత్రిపూట ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అందుకే మామిడి వంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తినకూడదు. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. రాత్రిపూట మామిడి పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారు. ఎందుకంటే మామిడి పండ్లలో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. రాత్రిపూట సరిగ్గా జీర్ణం కాకపోతే, బరువు పెరిగే అవకాశం ఉంది. మామిడి తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అందుకే శరీరం అలసిపోయినా నిద్ర పట్టదు. రాత్రిపూట మామిడిపండు తినడం వల్ల నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి.

Share this post

scroll to top