పాడి రైతులకు అదిరే గుడ్ న్యూస్. టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులకు ఊరట కలిగే నిర్ణయంతో ముందుకు వెళ్లనుంది. పశువులు కలిగిన వారికి భరోసా కల్పించేలా కొత్త విధివిధనాలు రూపొందించే పనిలో ఉందని తెలుస్తోంది. పశు బీమా పథకం ద్వారా రైతులకు ధీమా కల్పించాలని భావిస్తోంది. విజయనగరం జిల్లాలో రోజువారీ పాల ఉత్పత్తులు దాదాపు 3.6 లక్షల లీటర్లు వరకు ఉంటాయి. ఒకవేళ పశువు మృత్యువాత పడితే అప్పుడు వారు జీవనాధారం కోల్పోవలసి ఉంటుంది. ప్రభుత్వం నుంచి పరిహారం అందితేనే మరొకటి కొనుగోలు చేసుకుని మళ్లీ ఉపాధి పొందే వీలుంటుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం పశు పోషకుల వేదనను అర్థం చేసుకొని పశు బీమా పథకాన్ని పట్టాలెక్కించేందుకు విధి విధానాలు రూపొందిస్తోంది. దీని వల్ల చాలా మందికి ఊరట లభించనుంది.
గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, ఉన్న వారికి అదిరే శుభవార్త..
