కాలంతో పాటు మనం కూడా మారాలి. కానీ అవసరానికి మించిన విషయాలు తెలుసుకుంటూ జనాలు చాలా స్మార్ట్ అవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు. ప్రస్తుతం అసలు దేని గురించి మాట్లాడుతున్నామో ఇప్పటికి మీకు అర్థం అయి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తర్వాత జనాలు ఎంతలా మారిపోయారు అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వాటిని వాడేస్తున్నారు. ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా ఫర్వాలేదు కానీ జేబులో మాత్రం సెల్ ఫోన్ ఉండాల్సిందే. అంతలా సెల్ ఫోన్ పై పిచ్చి పెంచుకున్నారు జనాలు.
అయితే తాజాగా జరిగిన పరిశోధన ప్రకారం స్మార్ట్ ఫోన్ ను రోజుకు సగటున 344 సార్లు అంటే ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి చూస్తున్నట్లు సర్వేలో తేలింది. పదే పదే సెల్ ఫోన్ చెక్ చేయడం వల్ల, నోటిఫికేషన్ రాకున్నా ఊరికే మొబైల్ ఆన్ చేసి చూస్తూ ఉండడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని నివేదికలో పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్క చిన్న విషయానికి ఫోన్ పై ఆధారపడడం వల్ల మెమోరీ పవర్ తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా వృద్ధాప్యంలో వినికిడి లోపం, వెంట్రుకలు తెల్లబడడం, మతిమరుపు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని మనకు ఇప్పటి వరకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కారణంగా చిన్న చిన్ని పిల్లలు కూడా వీటి బారిన పడుతున్నారు. ఇప్పటినే అమెరికాలో జరిపిన ఈ సర్వేలో దాదాపు చాలా మంది ఫోన్ కారణంగా చదువుకోవాల్సిన వయసులో ఈ మతిమరుపు వ్యాధితో బాధ పడుతున్నట్లుగా తెలిపారు. అంతేకాదు చిన్న పిల్లలకు ఈ సమస్య రావడానికి పెద్దగా టైం పట్టదు ఇప్పటి నుంచే వారిని ఫోన్ కి దూరంగా ఉండేలా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు.