గతంలో ఇదే స్పాట్‌లో రెండు సార్లు చైన్ స్నాచింగ్ ..

gold-17.jpg

రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ ఫిల్డర్ బెడ్ వద్ద ఉన్న బస్ స్టాప్ లో ప్రభుత్వ ఆస్పత్రిల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లారు స్నాచర్. మహిళను కిందపడేసి కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో స్పల్పంగా గాయాలయ్యాయి. మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును దొంగిలించారుదొంగలు. మహిళ తేరుకొని కేకలు వేసినా ఫలితం లేకుండా పోయింది. స్నాచర్ పకన చెట్ల పొదల్లోకి వెళ్లి మాయ మయ్యాడు. బాధితురాలి ఫిర్యాదులో రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ శరా మామూలే.. గతంలో కూడా రెండు చైన్ స్నాచింగ్ లు ఈ ప్రాంతంలో జరిగాయి.ఇది మూడో ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

Share this post

scroll to top