తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏపీలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న వాయుగుండం ఒడిశాలోని చిలికా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని పూరీ తీరానికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్ పూర్‌కు ఈశాన్యంగా 70 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పారు. ఇది వాయువ్యం దిశగా కదులుతూ.. ఒడిశా – ఛత్తీస్ గఢ్ భూభాగాలపైకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రభావంతో ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు.
భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి..
