ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదిరే గుడ్ న్యూస్ అందించారు. కీలక ప్రకటన చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ చంద్ర బాబు ఏ నిర్ణయం తీసుకున్నారు? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. ప్రాజెక్టులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్ర బాబు కీలక ప్రకటన చేశారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లా మంత్రులు వెంటనే వరద బాధితులను పరామర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితుల కుటుంబాలకు వెంటనే రూ. 3 వేలు ఆర్థిక సాయం అందించాలని తెలిపారు. అలాగే అధికారులు పంట నష్టం వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. నష్టపోయినా ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
వరద బాధితులకు కీలక ప్రకటన..
