తల్లిదండ్రులు అవ్వడం అనేది ఓ గొప్ప వరం.. చాలా మంది పిల్లలను కనాలని ఆశపడుతూ ఉంటారు. అయితే సినిమా సెలబ్రెటీలు మాత్రం 9 నెలలు గర్భంతో ఉండటం కొంత కష్టంగా భవిస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ 9 నెలలు గర్భం దాల్చి పిల్లలను కంటుంటే.. కొంతమంది మాత్రం షార్ట్ కట్ లో అద్దె గర్భం అదే.. సరోగసి ద్వారా పిల్లలను కంటున్నారు. ఇలా అద్దె గర్భం ద్వారా పిల్లలను కన్నవారు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న హీరోయిన్స్ దగ్గర నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు చాలా మంది చాలామంది సరోగసి ద్వారా తల్లులయ్యారు. ఆ హీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.! బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సరోగసి వ్యవహారంలో పెద్ద చర్చే జరిగింది. అప్పట్లో ఈ అమ్మడు గర్భం దాల్చిందని కొందరు.. లేదు సరోగసి ద్వారా బిడ్డను కన్నది అని కొంతమంది చర్చించుకున్నారు. ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనాస్ లు సరోగసి ద్వారా ఆడబిడ్డకు జన్మించారు. హాట్ బ్యూటీ సన్నీలియోన్ కూడా సరోగసి ద్వారా తల్లయ్యింది.. సరోగసి ద్వారా సన్నీ కవల పిల్లలకు తల్లయ్యింది. ఆ తర్వాత మరో బిడ్డను దత్తత తీసుకుంది. ఇక టాలీవుడ్ విషయానికొస్తే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ కూడా సరోగసి ద్వారా బిడ్డను పొందింది. ఇక రీసెంట్ గా లేడీ సూపర్ స్టార్ నయన తార కూడా సరోగసి ద్వారా తల్లయ్యింది.
అందం చెక్కు చెదరకుండా ..
