అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ 3 ఆహారాలు కొవ్వును వెన్నలా కరిగించేస్తాయ్‌..

helth-04.jpg

తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో కాలేయం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఫ్యాటీ లివర్, కార్డియోవాస్కులర్ వ్యాధులు కూడా దాడి చేస్తాయి. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది రక్త నాళాలలో పేరుకుపోయి, రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.

కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం బరువు పెరగడానికి దారితీస్తుంది. కాలు తిమ్మిర్లు వస్తాయి. అంతే కాకుండా ఛాతీపై ఒత్తిడి, శ్వాస ఆడకపోవడం, అధిక రక్తపోటు వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. కొలెస్ట్రాల్ నిర్ధారణ అయిన తర్వాత తప్పనిసరిగా మందులు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అలాగే ఆహారంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి.

బయట గ్రిల్స్, ఆయిల్-స్పైసీ ఫుడ్ వంటి వాటిని పూర్తిగా మానేయాలి. మద్యం, ధూమపానం కూడా మానేయాలి. అంతేకాకుండా ఆహారంలో 3 రకాల ఆహారాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. అందుకు తృణధాన్యాలు, వోట్స్, మిల్లెట్, బార్లీ, డాలియా వంటి పీచు ఆహారం తీసుకోవాలి.

పెక్టిన్ అధికంగా ఉండే పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. పెక్టిన్ అనేది కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా తగ్గించే ఒక రకమైన కరిగే ఫైబర్. యాపిల్స్, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, సిట్రస్ పండ్లను తినవచ్చు.

కొలెస్ట్రాల్ రోగులు.. ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఈ పోషకాలు సీఫుడ్, బాదం, వాల్‌నట్స్, చియా విత్తనాలు, అవిసె గింజలు వంటి ఆహారాలలో అధికంగా ఉంటాయి.

Share this post

scroll to top