ఒక్కప్పుడు ఐటమ్ సాంగ్స్ కోసం సెపరేట్ గా కొంత మంది హాట్ బ్యూటీలు ఉండే వారు. లేదు అంటే సెపరేట్‌గా కొంత మోడల్స్ అని ఐటెం గర్ల్స్ అని విదేశాల నుంచి తెల్ల తోలు బ్యూటీ లని దింపే వారు. ఎందుకంటే హీరోయిన్లు ఇలాంటి పాటలు చేయడానికి నిరకరించేవారు. కానీ ప్రజంట్ స్టార్ హీరోయిన్స్ మాత్రం ఐటెం సాంగ్స్ చేసేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. క్రేజ్‌కి క్రేజ్, రెమ్యునరేషన్‌కి రెమ్యునరేషన్ వస్తుండడంతో అసలు వదులుకోవడం లేదు. ఇందులో భాగంగా తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల మరో స్టార్ హీరోతో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ దక్కిందట.
మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది. ఉప్పెన ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇందులో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో ఓ మాస్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట బుచ్చిబాబు. దీని కోసం రామ్ చరణ్ సరసన శ్రీ లీల స్టెప్పులు చేయబోతోందట. ఈ ఫుల్ ఎనర్జిటిక్ మాస్ సాంగ్‌తో థియేటర్ దద్దరిల్లేలా చేయనుందట శ్రీలీల. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తేలినప్పటికీ ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.