కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు..

bjp-07.jpg

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలు యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీస్ పై రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారి పరస్పరం కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. అక్కడికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చ ప్రయత్నం చేస్తున్నారు.

Share this post

scroll to top