ఇరకాటంలో పడ్డ చంద్రబాబు సర్కార్..

laddu-20.jpg

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తుంటారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హాయంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు తాజాగా బయటపెట్టారు.

లడ్డుల్లో నెయ్యిపై జులై 8, 2024న ల్యాబ్‌ కు పంపించగా జులై 17వ తేదీన NDDB CALF ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్నారు. దీంతో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చేలరేగింది. వైసీపీపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.అయితే ఈ ఇష్యూపై వైసీపీ నాయకులు ఘాటుగానే స్పందిస్తున్నారు. చంద్రబాబు హామీల అమల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా దీనిపై టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమలపై ఏ రాజకీయ నాయకుడు చేయని వ్యాఖ్యలు చంద్రబాబు చేశారన్నారు.

Share this post

scroll to top