ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. వరదల్లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే అంశంపై కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరదలతో ప్రజల ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు తడిచి పాడైపోయాయి. కంపెనీలు సామాజిక బాధ్యతతో బాధిత ఎలక్ట్రానిక్ వస్తువులు బాగు చేసేందుకు ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో స్పేర్ పార్ట్స్ డిస్కౌంట్లో అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎలక్ట్రానిక్ కంపెనీల సేవల బృందాలు ఒకే వేదిక మీదకు వచ్చి సర్వీస్ అందిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఇప్పుడు మీరు స్పందించే తీరే కస్టమర్లలో మీ బ్రాండ్ నిలబడుతుంది. కంపెనీల వారిగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి అదనంగా టెక్నీషియన్లను ఏర్పాటు చేయండని సూచించారు.
వరదల్లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు ..
