ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.. ఇక, సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 11వ తేదీన అంటే రేపు.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు ప్రాంతంలో కలెక్టర్ పర్యటించి, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ దీపికా పాటిల్‌తో చర్చించారు. ఇప్పటికే నిర్మితమైన రన్‌వేపై ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడి నుంచి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వద్దకు చేరుకొని వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. ఫొటో ఎగ్జిబిషన్, వీఐపీ లాంజ్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వర్షాకాలం కావడంతో, జెర్మన్ హేంగర్లతో పటిష్టమైన షెడ్లను నిర్మించాలని సూచించారు. అనంతరం టెర్మినల్ భవనం వద్దకు చేరుకొని ఏర్పాట్లపై సమీక్షించారు. టెర్మినల్ భవన నిర్మాణ పనుల పరిశీలించనున్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు.. జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని అధికారులను ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్..
రేపు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చంద్రబాబు.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..
