ప్రధాని మోడీతో రేపు సీఎం చంద్రబాబు భేటీ..

cbn-17.jpg

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ ఎంపీలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపై పీఎం మోడీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

Share this post

scroll to top