తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో బిజీబజీగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి పనులు, పెండింగ్ నిధులపైన కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమైన రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణకు సంబంధించిన వివరాలను ఖట్టర్ కు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక ఖట్టర్ తో భేటీకి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రేవంత్ సమావేశం అయ్యారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వండి..
