ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో వచ్చే నెల 16ను కేసు విచారణ వాయిదా పడింది. గురువారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. విచారణకు సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, మత్తయ్య, సెబాస్టియన్ హాజరు కాగా, సీఎం రేవంత్ రెడ్డి, వేం కృష్ణ కీర్తన్ గైర్హాజరయ్యారు.
కాగా, గత నెల 16న జడ్జి లీవ్‌లో ఉండటంతో కోర్టు కేసును నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. 2015 మే 31న ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మరో ఎమ్మెల్యే స్టిఫెన్‌సన్‌కు నోట్ల కట్టలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్టు అభియోగాలున్నాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రేవంత్‌రెడ్డితోపాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహ, సండ్ర వెంకటవీరయ్యతోపాటు రూ.50 లక్షలు సమకూర్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వేం కృష్ణకీర్తన్ తదితరులపై కేసు నమోదు చేసింది.