తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర విషాదం చోటు చేసుకంది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి కన్నుమూశారు. 2009-2014 వరకు ఉప్పల్ ఎమ్మెల్యేగా ఆయన పని చేశారు. కొంతకాలంగా రాజిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది, రాజిరెడ్డి మృతిని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు రాజిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యం చెప్పారు. ప్రజలకు రాజిరెడ్డి చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు.
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం..
