అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..

ravanth-07.jpg

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పలు రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్ల సహాయం ప్రకటించగా తెలంగాణ మాత్రం రూ.416.80 కోట్లు మాత్రమే ఇచ్చారు. తెలంగాణలో వరదలతో చాలా నష్టపోయిందని రేవంత్ అమిత్ షాకు వివరించినట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రె అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణపై వార్తలు వస్తుండడంతో రేవంత్ పార్టీ పెద్దలతో ఇందుకు సంబంధించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సోమవారం రాత్రికి లేదా.. మంగళవారం ఉదయం తిరిగి హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది.

Share this post

scroll to top