వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

cm-ravanth-2.jpg

భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు. కలెక్టరేట్ ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలని, భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలని, వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని, తక్షణమే కేంద్ర సాయం కోరుతూ లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని లేఖలో కోరారు సీఎం రేవంత్‌ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తామన్నారు. ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు విడుదల చేశారు.

Share this post

scroll to top