క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజలకు అందుబాటులో..

cm-ravanth-2-1.jpg

సూర్యాపేట జిల్లాలో జరిగిన వరద నష్టంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మోతె మండలం నామవరంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం.. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ.. పంట, ఆస్తి నష్టంపై అధికారుల నుంచి ప్రాథమిక నివేదిక తీసుకున్నట్లు తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, అధికారులతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని సీఎం హామీ ఇచ్చారు. అలాగే వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలా కాకుండా పంట నష్టం జరిగితే ఎకరానికి రూ.10వేల సాయం, పశువులు చనిపోతే రూ.50 వేల సాయం అందిస్తామని, ఒకవేళ ఎవరైనా ఇళ్లు కోల్పోతే వారికి తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు. రక్షణ చర్యల కోసం ఇప్పటికే సూర్యాపేట కలెక్టర్‌కు తక్షణ సాయంగా రూ.5 కోట్లు అందజేశామని వెల్లడించారు.

Share this post

scroll to top