ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండోరోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌తో పాటు, పలువురు మంత్రులను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. నిన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, సింగరేణి బొగ్గు గనులు, రహదారులు, కేంద్రీయ విద్యాలయాల గురించి విజ్ఞప్తులు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో, మంత్రివర్గ విస్తరణ పై చర్చకు వచ్చే అవకాశం ఉందిని తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణ పై ఢిల్లీ టూర్ లో క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. విస్తరణపై ఇప్పటికే ఆశావాహులు ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. ఢిల్లీ టూర్ లో క్యాబినెట్ విస్తరణ పై హై కమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ భేటి ఉండే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో సీఎం సహా 11 మంది మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ విస్తరణ ఉంటే మరో ఆరుగురికి చోటు దక్కే ఛాన్స్ ఉంటుంది.