ఉదయం గాంధీభవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నుంచి సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ వరకు సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ అంతా బిజీబిజీగా గడపనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం. నేడు ఉదయం గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేస్తారు. పరేడ్ గ్రౌండ్ చేరుకొని సైనికుల స్మారకానికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు..
