ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్ సంచలనంగా మారింది. మా ప్రభుత్వం గురించి మీరు చేసిన ప్రకటనలలో అనేక అపోహలు అవాస్తవాలు ఉన్నాయని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2023 నుండి తెలంగాణలో దాదాపు దశాబ్దం పాటు బీఆర్ఎస్ దుష్పరిపాలన తర్వాత రాష్ట్రమంతా ఆనందం & ఆశలు వెల్లువెత్తాయని తెలిపింది.
మేము బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం తన మొదటి మరియు రెండవ వాగ్దానాన్ని అమలు చేసిందన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్య సంరక్షణ విడుదల చేశామన్నారు. గత 11 నెలల్లో తెలంగాణలోని మా సోదరీమణులు తల్లులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 101 కోట్లకు పైగా ఉచిత బస్సు యాత్రలను చేపట్టారన్నారు. ఒక సంవత్సరం లోపు రూ. 3,433.36 కోట్లు ఆదా చేశారన్నారు.