హీరోలు హీరోయిన్ వరుస సినిమాలు చేస్తూ వస్తున్న రెమ్యూనరేషన్స్‌తో తెలివిగా బిజినెస్‌లు స్టార్ట్ చేస్తున్నారు. హోటల్స్ అని థియేటర్లు అని పెట్టుబడులు పెడుతూ. మరికొంత మంది వోన్గా కూడా పలు వ్యాపారాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా అక్కినేని నాగ చైతన్య కూడా హైదరాబాద్‌లో ‘షోయూ’ అనే పేరుతో ఒక ప్రీమియం క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక్కడ పాన్-ఏషియన్ వంటకాలు స్పెషల్. రీసెంట్గా ఇందులో ఫుడ్ బాగుందంటూ ఎన్టీఆర్ కూడా ప్రశసించాడు. కానీ తాజాగా ఈ రెస్టారెంట్‌కి సంబంధించన షాకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
ఈ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్‌లో బొద్దింక రావడం కలకలం రేపింది. ఆర్డర్ చేసిన నెటిజన్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. తాను షోయూ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అందులో బోద్దింక కనిపించిందని ‘షోయూ’ టీమ్‌కి కంప్లయింట్ చేస్తూ మీరు మరింత మెరుగ్గా ఎలా సేవలు అందిస్తాం అని చెప్పడం కాదు. ముందు మా భోజనంలో బొద్దింకలు లేకుండా చూసుకోవడం నుంచి మొదలుపెట్టండి. అంటూ నెటిజన్ రాసుకోచ్చాడు. పోస్ట్‌తో పాటు ఫొటోలు కూడా శేర్ చేశాడు. మరి ఈ వివాదంపై షోయూ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.