రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల పరిధిలో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాబోయే రెండు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 40డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.