హుజురాబాద్ గడ్డ మీద బూడిద పంచాయితీ.. అంజనేయుడి సాక్షిగా తేల్చుకుందాం రా

congrass-25.jpg

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయం రోజు రోజుకు హీటెక్కుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు సైతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అవినీతి ఆరోపణలతో ఎదురుదాడికి దిగారు. ఇవాళ చెల్పూర్ హనుమాన్ ఆలయం దగ్గరికి రావాలని సవాల్ విసిరారు హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ప్రణవ్. టెంపుల్ దగ్గరకు వస్తే అవినీతి ఏంటో నిరూపిస్తామంటూ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సై అంటూ కాసేపట్లో టెంపుల్‌ దగ్గరకు వస్తున్నట్లు ప్రకటించారు. నిబంధనలకు విరుద్దంగా రవాణా అవుతున్న బూడిద పంచాయితీ కాస్తా దేవుని వద్దకు చేర్చేలా చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య జరుగుతున్న యాష్ సప్లై వ్యవహారం రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వందల కోట్ల స్కామ్ అంటూ ఆయన ఏకంగా బూడిద రవాణా చేసే లారీలను అడ్డుకుని ఆరోపణలకు దిగారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు.

Share this post

scroll to top