గొప్ప కార్యక్రమాన్ని గాలికొదిలేశారు..

harish-rao-30.jpg

మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకు గాను కెసిఆర్ గారు ప్రారంభించిన 1962 -పశువైద్య సంచార వాహన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయం. కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు సైతం పొంది దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన గొప్ప కార్యక్రమ నిర్వహణను గాలికి వదిలేసి మూగజీవుల రోదనకు కారణమవుతున్నది. ఒకవైపు వాహనాల్లో మందుల కొరత కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మూగజీవుల ప్రాణాలు కాపాడాలనే సదాశయం నీరుగారిపోతుండగా.. మరోవైపు వాహన డ్రైవర్, డాక్టర్, ఇతర సిబ్బందికి వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారి ఆవేదన చెందుతున్నరు. ప్రభుత్వం వెంటనే స్పందించి 1962 వాహనాల్లో మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని, ఉద్యోగ సిబ్బందికి ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

Share this post

scroll to top