ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్న వేళ మంచి కంటి నగర్‌లో ఉద్రిక్తత చెలరేగింది. పర్యటనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై కొందరు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరి తలలకు గాయాలు కాగా, వారిలో ఒకరి కాలు కూడా విరగడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితులను పరామర్శించనివ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలే దాడులకు దిగుతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ కు తీవ్రగాయాలు అయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించుకుండా కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేత మిక్కిలినేని నరేంద్ర ఆధ్వర్యంలోనే దాడులు చేశారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవాలని కోరుతుంటే తమపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై రాళ్ల దాడి..
