కవిత కోసం ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ మంతనాలు బండి సంజయ్‌ వ్యాఖ్యల మర్మమదే..

brs-15-1.jpg

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై ఆ పార్టీ సీనియర్‌ నేత మధుయాష్కీ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఏఐసీసీ డైరక్షన్‌ మేరకే రాష్ట్రంలో చేరికలు జరుగుతున్నాయన్నారు. అలాగే, లిక్కర్‌ స్కాంలో కవితను విడిపించేందుకు ఢిల్లీ పెద్దలతో బీఆర్‌ఎస్‌ నేతలు మంతనాలు జరుపుతున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. కాగా, మధుయాష్కీ తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌లో చేరికలు ఏఐసీసీ డైరెక్షన్‌ మేరకే జరుగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిచిన మూడు రోజులకే సర్కార్‌ పడిపోతుందన్నారు. దళిత నేత భట్టి విక్రమార్క సీఎల్పీగా ఉన్నప్పుడు ఆ హోదా పోయేలా బీఆర్‌ఎస్‌ పనిచేయలేదా?. దళితుల వ్యతిరేకంగా ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్‌ పనిచేశారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేర్చుకున్న నేతలకు మంత్రి పదవులు ఇస్తుంది. ప్రజా గాయకుడు గద్దర్‌ను గేటు వద్దనే గంటల తరబడి నిలబెట్టింది కేసీఆర్ కాదా?. ప్రజా పాలనలో అందరికీ మాట్లాడే స్వేచ్చ ఉంది. సీఎం రేవంత్‌ ఎవరైనా కలవొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చొరబడి తానే ఉద్యమం చేసినట్లు కలరింగ్ ఇచ్చాడు.

Share this post

scroll to top