కాంగ్రెస్ రుణమాఫీ అనుకున్న విధంగానే చేసేసింది..

ravanth-23-1.jpg

కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేర్చుకుంటూ వెళ్తోంది. ఒకే సారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తమని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అనుకున్న విధంగానే చేసేసింది. అయితే జులై 18న రూ. లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేయగా ఈ నెలాఖరులోగా రూ.1.50 లక్షల రుణాలు కలిగిన రైతుల అకౌంట్లోలో వడ్డీతో సహా జమ చేయనున్నారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణాలు కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నారు. ఇదిలా ఉండగా లక్షలోపు రుణం ఉన్న రైతులకు కూడా చాలా మందికి మాఫీ కాలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. అయితే వీటికి అధికారులు వివిధ రకాలు కారణాలు చెబుతున్నారు. రేషన్ కార్డులో ఎంత మంది రుణం తీసుకున్నా ఒక్కరికి మాత్రమే మాఫీ ఉంటుందని కొన్ని జిల్లాలోని అధికారులు రైతులకు చెబుతున్నారు. అయితే కుటుంబంలో ఎంత మంది రుణం తీసుకున్న వడ్డీతో కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అవుతుందని వీటిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇటీవల స్పష్టం చేశారు. లక్ష లోపు రుణం తీసుకున్నవారికి వడ్డీతో కలిపి లక్ష క్రాస్ అయిన వారికి మాఫీ కాలేదు వారికి రెండో విడతలో మాఫీ అవుతాయని అధికారులు తెలుపుతున్నారు. అయితే రెండో విడత లిస్ట్ ఎప్పుడు వస్తోందో అని రైతులు ఎదురుచూస్తున్నారు. రెండో విడతకు సంబంధించి అర్హులైన రైతుల వివరాల లిస్ట్ ను జులై 29న https://clw.telangana.gov.in/Login.aspx వెబ్ సైట్లో అందుబాటులో ఉండనున్నాయి.

Share this post

scroll to top