కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో సంచలన ట్వీట్ చేశారు. తనకు వైఎస్ఆర్ స్పూర్తి అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను వైఎస్ షర్మిల నెరవేర్చగలరని ధీమాను వ్యక్తం చేశారు. అదే క్రమంలో సోనియా గాంధీ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలుచుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అలాంటి పటిష్టమైన నాయకత్వ లక్షణాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ షర్మిల అయితేనే ఏపీలో రాణించగలరని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ కీలక భేటీకి వేదికైంది ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మంగళగిరి. ఇప్పటికే దేశంలో ఎన్డీయే సర్కార్ కొలువు దీరినప్పటికీ ఇండియా కూటమి కూడా ధీటైన సీట్లతో గట్టిపోటీ ఇచ్చింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చింది కాంగ్రెస్. దేశంలో ప్రతిపక్షపాత్రను పోషిస్తోంది.
ఏపీలో ‘వైఎస్ఆర్’ పొలిటికల్ అస్త్రం.. కాంగ్రెస్ వ్యూహం ఇదేనా..
