ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మద్యం ధరలపై మందుబాబుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ స్పందించారు. విజయవాడలోని వైన్ షాపు వద్దకు వెళ్లారు. మద్యం ధరలు, నాణ్యతపై ఆరా తీశారు. కొత్త సీసాలో పాత సారా అంటూ సెటైర్స్ వేశారు. సరసమైన ధరలు నాణ్యమైన సారాయి అంటూ ఎద్దేవా చేశారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుందని విమర్శించారు. రూ. 99కే మద్యం అంటూ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రీకరణ పేరుతో పాత ప్రభుత్వం, వికేంద్రీకరణ పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేశాయని మండిపడ్డారు. ‘సారాయి అంటేనే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది. అని నారాయణ ప్రశ్నించారు.
విజయవాడలోని వైన్ షాపు వద్ద సీపీఐ నేత నారాయణ..
